సాధారణ వంటమనిషి పేరుపై కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయని పేర్కొంటూ భారీ ఆదాయపు పన్ను డిమాండ్ విధించిన అధికారుల తీరుపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పాన్ నంబర్ దుర్వినియోగం కావడంతో సంబంధం లేని లావాదేవీలకు బాధ్యుడిని చేయడం సరికాదని స్పష్టం చేసింది. సరైన విచారణ జరపకుండా విధించిన సుమారు రూ.3.91 కోట్ల పన్ను డిమాండ్‌ను రద్దు చేసింది.
లలిత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జస్టిస్ దినేశ్ మెహతా, జస్టిస్ అదితి చౌధరి ధర్మాసనం ఆదాయపు పన్ను మదింపు ఉత్తర్వులను పక్కనపెట్టింది. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు ప్రయత్నించవచ్చని, అయితే వాస్తవాలను విస్మరించకూడదని వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాన్ నంబర్‌తో కోట్ల రూపాయల లావాదేవీలు
పిటిషనర్ గతంలో కాంట్రాక్టు పద్ధతిలో భద్రతా సిబ్బందిగా, ఆ తర్వాత వంటమనిషిగా పనిచేశారు. పన్ను చెల్లించాల్సినంత ఆదాయం లేకపోయినా, ప్రభుత్వ గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పాన్ కార్డు పొందినట్లు ఆయన కోర్టుకు తెలిపారు.












