ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తూ, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుతూ చులకనగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను హెచ్చరించారు. కడప జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మూడవ త్రైమాసిక జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ప్రసాదరావు, ఎస్పీ తుషార్ డూడి, కమిటీ సభ్యులు, ఆర్డీఓలు, డీఎస్పీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు తమ సమస్యలతో కార్యాలయాలకు వస్తే గౌరవంగా చూడాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఇంటి పట్టాలు, శ్మశాన వాటికలు, రహదారులు, తాగునీరు, విద్యుత్, భూ సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అట్రాసిటీ కేసులపై కలెక్టర్ దృష్టి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని, ఇళ్ల పట్టాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాల మంజూరును వేగవంతం చేయాలని సూచించారు. బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన 74 మంది వెట్టిచాకిరి బాధితులకు 7 రోజుల్లో పరిహారం అందజేస్తామని, ఇప్పటివరకు 154 మంది అట్రాసిటీ బాధితులకు రూ.1.16 కోట్ల పరిహారం అందించామని తెలిపారు.

