పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. జగన్‌ను కలిసేందుకు ఉదయం నుంచే క్యాంపు కార్యాలయం వద్ద ప్రజలు బారులు తీరారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ అందరితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. తమ గోడును వినిపించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా ఆలకించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజకీయాలపై చర్చ
పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు వచ్చిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులకు సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

