జిల్లా బద్వేల్ పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు రోడ్డులో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి, చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మూడవ రోజు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని 21 రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు.
దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం అమ్మవారిని 21 రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. దీనిని శాకంబరీ అలంకరణ అని కూడా అంటారు. వంకాయ, బెండకాయ, క్యారెట్, బీరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాటా, మిరపకాయలు, చిక్కుడుకాయలు, దొండకాయలు తదితర 21 రకాల కూరగాయలతో అమ్మవారికి అద్భుతమైన అలంకరణ చేశారు. కూరగాయలతో అలంకరించిన అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి కుంకుమార్చన, సహస్రనామార్చన చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.












