ప్రపంచాన్ని కాలినడకన చుట్టి రావాలన్న లక్ష్యంతో 28 ఏళ్ల క్రితం ఇంటి నుంచి బయలుదేరిన బ్రిటన్ సాహసికుడు కార్ల్ బుష్బీ ఎట్టకేలకు తన స్వస్థలానికి చేరుకున్నారు. దాదాపు 50 వేల కిలోమీటర్లు, నాలుగు ఖండాలు, 30 దేశాల మీదుగా సాగిన ఆయన సుదీర్ఘ ప్రయాణం న ముగిసింది. ఇంగ్లండ్‌లోని హల్ నగరానికి చేరుకున్న ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న కార్ల్ బుష్బీ, గతంలో బ్రిటన్ సైన్యంలోని పారాచూట్ రెజిమెంట్‌లో పనిచేశారు. 1998లో చిలీలోని పుంటా అరేనాస్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి మోటారు వాహనాలను ఉపయోగించకుండా నడుచుకుంటూ స్వస్థలమైన హల్కు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం పూర్తయ్యే వరకు ఇంటికి తిరిగి వెళ్లకూడదని రెండు కఠినమైన నియమాలు పెట్టుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రయాణంలో ఎదురైన సవాళ్లు
ఈ ప్రయాణంలో ఆయన దక్షిణ, ఉత్తర అమెరికా, అలాస్కా, రష్యా, మధ్య ఆసియా, యూరప్ ప్రాంతాల మీదుగా సాగారు. 2006లో అలాస్కా నుంచి రష్యాకు మధ్య ఉన్న బెరింగ్ జలసంధిని గడ్డకట్టిన మంచుపై దాటారు. కాస్పియన్ సముద్రాన్ని ఈదుకుంటూ దాటడంతో పాటు, చివరి దశలో ఫ్రాన్స్ నుంచి ఇంగ్లండ్‌కు ఇంగ్లీష్ ఛానల్‌ను కూడా ఈదారు.
ఈ ప్రయాణంలో వీసా సమస్యలు, సరిహద్దు ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, కరోనా మహమ్మారి వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. పనామాలో కొంతకాలం జైలులో ఉండాల్సి రావడం, రష్యాలో వీసా సమస్యల కారణంగా ప్రయాణం నిలిచిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట పదేళ్లలో పూర్తవుతుందని భావించిన యాత్ర ఇలా 28 ఏళ్లకు చేరింది.







