ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత జామీ ఫాక్స్ మరోసారి తండ్రయ్యారు. 58 ఏళ్ల వయసులో తన ప్రియురాలు అలైస్ హక్స్టెప్తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలికారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ వార్తతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జామీ ఫాక్స్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాజీ భాగస్వామి కొన్నీ క్లైన్తో కలిగిన కుమార్తె కొరిన్ వయసు 32 సంవత్సరాలు కాగా, క్రిస్టిన్ గ్రానిస్తో కలిగిన మరో కుమార్తె అనలీస్ వయసు 18 సంవత్సరాలు. తాజాగా జన్మించిన బిడ్డతో ఆయన ముగ్గురు పిల్లలకు తండ్రయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జామీ ఫాక్స్, అలైస్ హక్స్టెప్ల సంబంధం 2023లో వెలుగులోకి వచ్చింది. కొంతకాలం విడిపోయినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసి కనిపించారు. ఈ ఏడాది మేలో వీరిద్దరూ తమ తొలి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి.






