భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా దౌత్య చర్చలు వేగవంతమయ్యాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబైకి చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఆయన కీలక చర్చలు జరపనున్నారు.
భారత్అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా దౌత్య చర్చలు వేగవంతమయ్యాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబైకి చేరుకున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, ఇంధన భద్రత, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఒప్పందం తుది దశకు చేరువైందని రూబియో ఇటీవల వ్యాఖ్యానించడం ఈ పర్యటనకు ప్రాధాన్యం తీసుకొచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాణిజ్య ఒప్పందంపై ఆశలు
భారత్, అమెరికా మధ్య కొంతకాలంగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై సుంకాల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం పెరిగింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, చర్చలు గణనీయంగా ముందుకు సాగాయని రూబియో పేర్కొన్నారు. అయితే ఒప్పందంలోని పూర్తి నిబంధనలు, తుది సంతకం చేసే తేదీపై అధికారిక ప్రకటన వెలువడలేదు.












