విదేశాల్లో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసుల్లో చిక్కుకున్న వ్యక్తులను భారత్‌లోకి అనుమతించకుండా అధికారులు అడ్డుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అమెరికాలో చైల్డ్ సెక్స్ అఫెండర్‌గా నమోదైన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
ఈ కేసులో పిటిషనర్ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆయనకు విదేశీ పాస్పోర్టుతో పాటు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా () కార్డు కూడా ఉంది. న ఆయన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనకు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. మొదటి అందుబాటులో ఉన్న విమానంలో తిరిగి వెళ్లాలని ఆదేశించారు. దీంతో తనకు ప్రవేశం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పిటిషనర్ వాదనలు
తనకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించడంపై పిటిషనర్ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రవేశం నిరాకరించడానికి అధికారులు సరైన కారణాలు వెల్లడించలేదని, తనకు ముందస్తు నోటీసు ఇవ్వలేదని తెలిపారు. తన కార్డును రద్దు చేయలేదని, నిలిపివేయలేదని పేర్కొన్నారు. అమెరికాలో తనపై 2019లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయని, 2022లో నో కాంటెస్ట్ ప్లీ అనంతరం జైలు శిక్షకు బదులుగా ప్రొబేషన్ విధించారని తెలిపారు. ఆ కేసులో చిన్నారులు లేదా మైనర్లకు సంబంధించిన అంశం లేదని వాదించారు. అయితే, అమెరికాలో తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగిన విషయాన్ని, నో కాంటెస్ట్ ప్లీ మరియు ప్రొబేషన్ విధించిన విషయాన్ని ఆయన ఖండించలేదు.
కేంద్ర ప్రభుత్వం వాదనలు
కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది అమిత్ తివారీ వాదనలు వినిపించారు. అమెరికాలో పిటిషనర్ చైల్డ్ సెక్స్ అఫెండర్‌గా నమోదైనందున, ఆయనను భారత్‌లోకి అనుమతించకుండా బ్లాక్‌లిస్ట్ చేసినట్లు తెలిపారు. న జారీ చేసిన కార్యాలయ మెమోరాండం ప్రకారం, చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడి దోషిగా తేలిన వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేసే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా, దేశంలోకి విదేశీయులను అనుమతించాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వ సార్వభౌమాధికార పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు.




