టాలీవుడ్ నటి అనుష్క శెట్టి తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ ఇండియాలో ట్రెండింగ్‌గా మారింది.
2005లో సూపర్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అనుష్క, అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాహుబలి చిత్రంలో దేవసేన పాత్ర ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాబోయే చిత్రం కథనార్
ఇటీవలి కాలంలో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న అనుష్క, ప్రస్తుతం మలయాళ చిత్రం కథనార్ ది వైల్డ్ సోర్సరర్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఆమె కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కుతోంది. అయితే, ఆమె సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నారనే వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.











