బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రొద్దుటూరు పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్ కూడా వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రొద్దుటూరు పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముందుగానే నిత్యావసర సరుకులు, తాగునీరు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, బాలింతలు వంటి సున్నిత వర్గాల వారు బయటకు రావద్దని కోరారు. విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకవద్దని, అలాగే భారీ చెట్ల కింద నిలబడటం వంటివి చేయవద్దని హెచ్చరించారు.
వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, సెల్ ఫోన్లు, పవర్ బ్యాంకులను ముందుగానే చార్జ్ చేసుకోవాలని, అలాగే కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ప్రసవానికి దగ్గరలో ఉన్న మహిళలు ముందుగానే వైద్య సహాయం పొందాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

