తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బద్వేల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏపీ వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు. వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేయాలని, ప్రమోషన్లను వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా తక్కువ వేతనంతో గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల విధులు, సర్వేలు, ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా పనిచేస్తున్నా తమకు తగిన గుర్తింపు లేదని వారు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వీఆర్ఏ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

