జిల్లా రాయచోటి ఆటో నగర్ సమీపంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐరన్ బంకు కార్మికులు ఈ ప్రమాదానికి గురయ్యారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జిల్లా రాయచోటి ఆటో నగర్ సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఆరుగురికి విద్యుత్ షాక్ తగలడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాధితులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారు రాయచోటిలో ఐరన్ బంకును తరలిస్తున్న సమయంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చికిత్స పొందుతున్న మహమ్మద్ తెలిపారు. ఐరన్ బంకు విద్యుత్ తీగలకు తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది.












