కర్ణాటకలోని జిల్లా చింతామణి తాలూకా చిన్నసంద్ర సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్‌పై వెళ్తున్న నవదంపతులను అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
చింతామణికి చెందిన షణ్ముఖ్ (27), మిథులా (24) గా మృతులను పోలీసులు గుర్తించారు. వీరికి ఐదు నెలల క్రితమే వివాహమైంది. ఆదివారం రాత్రి బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిన్నసంద్ర సమీపంలో రహదారిపై స్కూటర్‌పై వెళ్తుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి దంపతులు ఎగిరిపడి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.












