జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడంతోపాటు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు వెంటనే అందించాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరింది. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశం అనంతరం సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడంతోపాటు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు వెంటనే అందించాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం జిల్లా పరిషత్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం అనంతరం, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి నేతృత్వంలో సంఘ నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టులతోపాటు వారి కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు అందేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. హెల్త్ కార్డులు లేక పేద జర్నలిస్టుల కుటుంబాలు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నాయని ఆయన తెలిపారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

