ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. బుధవారం బైరాగిపట్టెడలోని ఎంజీఎం స్కూల్ నుంచి పోస్టల్ కాలనీ వరకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ టీవీఎస్ షోరూం, లక్ష్మీపురం సర్కిల్ మీదుగా సాగింది.
స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది, స్థానిక పోలీసులు, బ్లాక్ కమాండోలు, ఎస్టీఎఫ్ బలగాలు ఈ ఫ్లాగ్ మార్చ్‌లో పాల్గొన్నాయి. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకే ఈ మార్చ్ నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు సూచనలు
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బలగాల వినియోగం
మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే విడతలో, పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్న నేపథ్యంలో బలగాలను సమర్థవంతంగా వినియోగించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

