గిరిజనుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారి హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సూచించారు. గురువారం గాంధారి మండలంలో పర్యటించిన ఆయన, స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు.
షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో పర్యటించారు. సేవాలాల్ చౌరస్తా వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు, తండాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందుతున్న తీరు వంటి అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం ఆయన వివిధ తండాలను సందర్శించి, స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. ఈ పర్యటనలో ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, డీపీఓ మురళి, సీఈఓ చందర్ నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్‌తో పాటు పలువురు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

