రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని గోపిక లక్ష్మిపై ఓ దుండగుడు చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడి చేశాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
పాఠశాలలో చదువుతున్న గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై ఈ దాడి జరిగింది. గొంతు కోసేందుకు ప్రయత్నించడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థినిని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెంటనే స్థానికులు, ఉపాధ్యాయులు విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
పాఠశాలలో భయానక వాతావరణం
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. పాఠశాల సమయంలోనే ఇలాంటి దాడి జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల దర్యాప్తు

