చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఉయ్ఘర్ యువతి రహిలే ఒమర్ ( ) 23 ఏళ్ల వయసులోనే మరణించారు. ఆమె మృతిపై ఈస్ట్ తుర్కిస్థాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ () తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో ఉయ్ఘర్ ముస్లింలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు ఈ ఘటన మరో ఉదాహరణ అని ఆరోపించింది.
రహిలే ఒమర్ చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన ఉయ్ఘర్ యువతి. ఆమెను 2017లో కేవలం 14 ఏళ్ల వయసులోనే అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెకు 2021లో 12 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు స్థానిక అధికారుల సమాచారం ఆధారంగా రేడియో ఫ్రీ ఆసియా () నివేదించింది. పెయిజివాట్ కౌంటీలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె ఇటీవల మరణించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధ్యక్షుడి తీవ్ర ఆరోపణలు
రహిలే ఒమర్ మరణంపై ఈస్ట్ తుర్కిస్థాన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అధ్యక్షుడు డాక్టర్ మమ్తిమిన్ అల తీవ్రంగా స్పందించారు. ఉయ్ఘర్ ప్రజలపై చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేతలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. యువతిని చిన్న వయసులోనే నిర్బంధించి, సుదీర్ఘకాలం జైలులో ఉంచడం మానవ హక్కులపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోందని పేర్కొన్నారు. చైనాలో ఉయ్ఘర్ ప్రజలపై జరుగుతున్న వేధింపులు, నిర్బంధాలు, మతపరమైన ఆంక్షలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరింది.











