తమ దేశంపై ఎవరైనా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. దాడి చేసే శత్రువులకు కొత్త ఆయుధాలతో విధ్వంసకర దెబ్బలు కొడతామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే తమ సైన్యం గట్టిగా ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగా సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దౌత్య చర్చలకు ఏడు షరతులు
అమెరికాతో దౌత్య చర్చలు జరగాలంటే ఇరాన్ విధించిన ఏడు షరతులను తప్పనిసరిగా నెరవేర్చాలని రెజాయీ స్పష్టం చేశారు. ఆ షరతులు నెరవేరితేనే దౌత్య చర్చలకు మార్గం సుగమం అవుతుందని, లేకపోతే చర్చల ప్రక్రియ ముందుకు సాగదని వెల్లడించారు.












