ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో విషసర్పంతో విన్యాసాలు ప్రదర్శించే ప్రయత్నం ఓ తండ్రీకొడుకుల ప్రాణాల మీదకు తెచ్చింది. దుర్గాపూజ మండపం వద్ద ప్రజలకు పామును చూపిస్తూ, దాని విషపు కోరలు తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో నాగుపాము యువకుడిని కాటేసింది. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రిని కూడా పాము కరవడంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించినట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి.
సత్రిఖ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మునక్కీపుర్వా గ్రామానికి చెందిన మహేశ్, ఆయన కుమారుడు నౌమీలాల్ పాములను పట్టడంలో ఆసక్తి చూపేవారని కథనాలు పేర్కొన్నాయి. గ్రామ సమీపంలోని తోటలో పట్టుకున్న విషసర్పాన్ని నౌమీలాల్ ఆదివారం రాత్రి పూజా మండపం వద్దకు తీసుకెళ్లి, అక్కడున్న వారికి చూపించాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాముకు విషపు కోరలు తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అతడి పట్టు సడలడంతో నాగుపాము చేతిలో నుంచి జారిపోయి, అతడి కాలును కాటేసింది. పామును తిరిగి పట్టుకునేందుకు ప్రయత్నించిన కుమారుడిని కాపాడే క్రమంలో తండ్రి మహేశ్ కూడా పాము కాటుకు గురయ్యాడు. అనంతరం పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది.












