నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,560 తగ్గి రూ.1,43,460కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,350 తగ్గి రూ.1,31,500గా నమోదైంది.
శుక్రవారం నాటికి 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,930 తగ్గి రూ.1,07,590కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కరీంనగర్, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న పరిణామాలు, బంగారం కొనుగోళ్లలో వచ్చిన మార్పులు దేశీయంగా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ దుకాణాల్లో తాజా ధరలను తెలుసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

