హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టు భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఆరు ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.
లక్ష్యాన్ని యూఏఈ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 4.2 ఓవర్లలోనే ఛేదించింది. భారత ఇన్నింగ్స్‌లో టీ. నటరాజన్ 14 బంతుల్లో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ త్రిపాఠి ఏడు బంతుల్లో 24 పరుగులు చేయగా, కెప్టెన్ క్రునాల్ పాండ్యా ఎనిమిది బంతుల్లో 15 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. యూఏఈ బౌలర్ జాహిద్ అలీ మూడు వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఓపెనర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్ ఖలీద్ షా కేవలం 14 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ అన్ష్ టాండన్ 12 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి స్కోరులో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ ఓటమితో హాంకాంగ్ సిక్సెస్ గ్రూప్-సి పోటీలో భారత్ పరిస్థితి క్లిష్టంగా మారింది. అంతకుముందు పాకిస్థాన్ చేతిలోనూ భారత్ ఓటమి చవిచూసింది. వరుస పరాజయాలతో భారత జట్టు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశాలు దెబ్బతిన్నాయి. మరోవైపు భారత్, పాకిస్థాన్‌లపై విజయాలు సాధించిన యూఏఈ గ్రూప్‌లో మెరుగైన స్థితిలో నిలిచింది.

