కర్ణాటక రాజధాని లోని ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్లో ఘోర ప్రమాదం జరిగింది. హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. వారిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనతో హోటల్ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హలసూరు ప్రాంతంలోని కాన్రాడ్ హోటల్లో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్ మూడో అంతస్తులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న జర్మనీకి చెందిన అలెగ్జాండర్ మాక్సిమిలియన్ థీస్ (57), స్లొవేకియాకు చెందిన జురాజ్ హోర్వాట్ (45) విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాయపడినవారికి చికిత్స
మృతులను కాపాడేందుకు ప్రయత్నించిన అమెరికా పౌరుడు మాథ్యూ డిసాంటిస్ (41), హోటల్ లైఫ్‌గార్డ్ రాహుల్ తివారీ (28) కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.












