భారత్ పర్యటనలో ఉన్న లీచ్టెన్స్టెయిన్ వారసత్వ యువరాజు అలోయిస్, యువరాణి సోఫీలకు రాష్ట్రపతి భవన్లో మంగళవారం అధికారికంగా ఘన స్వాగతం లభించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువరాజు దంపతులకు స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు యువరాజు అలోయిస్ నుంచి 28 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ఉన్నతస్థాయి అధికారుల బృందంతో పాటు వ్యాపార రంగానికి చెందిన ప్రతినిధులు కూడా వచ్చారు. ముంబైలో పర్యటన ప్రారంభించిన యువరాజు, గుజరాత్‌లోని వడోదరలో కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సోమవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంగళవారం రాష్ట్రపతి భవన్లో స్వాగత కార్యక్రమం అనంతరం మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించడం, భారత నాయకులతో ఉన్నతస్థాయి సమావేశాలు పర్యటనలో భాగంగా ఉన్నాయి.












