క్యాన్సర్ చికిత్స ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మిశ్రమ ఫలితాలనిస్తున్నాయి. 543 బ్రాండ్ల క్యాన్సర్ మందుల గరిష్ఠ చిల్లర ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సవరించినప్పటికీ, కొన్ని మందుల ధరలు భారీగా తగ్గగా, మరికొన్నింటిలో ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా అధిక ధర కలిగిన ఆధునిక క్యాన్సర్ ఔషధాల ధరలు యథాతథంగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఔషధాల విభాగం న సవరించిన ధరల జాబితాను విడుదల చేసింది. ఔషధ కంపెనీలు వరకు సమర్పించిన వివరాల ఆధారంగా 543 బ్రాండ్ల ధరలను ప్రకటించింది. ఈ ధరలు నుంచి అమల్లోకి రానున్నాయి. కంపెనీలు తాజా ధరల వివరాలను సమర్పించిన కొద్దీ జాబితాను నవీకరిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ధరల తగ్గింపు ఉదాహరణలు
సవరించిన జాబితాలో పలు క్యాన్సర్ ఔషధాల ధరలు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు: అనార్జోల్: గతంలో రూ.695.76గా ఉన్న ధర రూ.73కు తగ్గింది. అజాసైటిన్ ఇంజెక్షన్: రూ.6,337 నుంచి రూ.1,495.04కు తగ్గింది. బెవాసిజాబ్ ఇంజెక్షన్: రూ.21,767.70 నుంచి రూ.5,930.13కు తగ్గింది. దసానాట్ 20 మాత్రలు: రూ.2,812.50 నుంచి రూ.1,085.93కు తగ్గాయి. ఫుల్బ్రెకా ఇంజెక్షన్: రూ.26,072.16 నుంచి రూ.5,491కు తగ్గింది. ఈ ధరలు నిర్దిష్ట బ్రాండ్లు, ఔషధ పరిమాణాలు, ప్యాకింగ్‌లకు సంబంధించినవి. ఇతర బ్రాండ్లు లేదా మోతాదులకు ధరలు వేరుగా ఉండవచ్చు.












