దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు, వాయు కాలుష్యం కమ్మేశాయి. సోమవారం ఉదయం గాలి నాణ్యత గణనీయంగా పడిపోవడంతో 483కు చేరింది, ఇది అత్యంత ప్రమాదకరమైన సీవియర్ స్థాయి. నగరంలోని కనీసం 15 పర్యవేక్షణ కేంద్రాల్లో 400 దాటింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి () గణాంకాల ప్రకారం, ఉదయం 8:10 గంటలకు ఢిల్లీ మొత్తం వాయు నాణ్యత సూచీ () 483కు చేరింది. ఇది అత్యంత ప్రమాదకరమైన సీవియర్ స్థాయి. వివేక్ విహార్, బురారీ, జహంగీర్‌పురి, రోహిణి, ఘాజీపూర్ వంటి ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా నమోదైంది. రహదారులపై దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆంక్షలు ఉన్నా తగ్గని కాలుష్యం
దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు పరిమితులు విధించినప్పటికీ, పలు ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. బాణసంచా పొగతో పాటు వాహనాల కాలుష్యం, నిర్మాణ పనుల నుంచి వెలువడే ధూళి, పంట వ్యర్థాల దహనం కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఇప్పటికే మూడో దశ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.











