దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి వంటి అత్యవసర ఇంధనాలకు ఎటువంటి కొరత లేదని, అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అత్యవసర ఇంధనాలకు దేశంలో కొరత లేదని, చమురు శుద్ధి కర్మాగారాలు అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. రిటైల్ అవుట్లెట్లలో కూడా ఎటువంటి కొరత నివేదించబడలేదని తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, పానిక్ బుకింగ్‌లు తగ్గాయని పేర్కొంది. కీలక రంగాలైన విద్యా సంస్థలు, ఆసుపత్రులకు ప్రాధాన్యతనిస్తూ, వాణిజ్య ఎల్పిజి కేటాయింపులను రాష్ట్రాలకు పెంచినట్లు, PNG కనెక్షన్ల విస్తరణను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది.











