కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీపావళిని 'సంతోషాల ఈద్'గా అభివర్ణించడం రాజకీయ చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన దీపావళి వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. దీపావళిని ఖుషియోంకా ఈద్ (సంతోషాల ఈద్)గా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే.. దీపావళి భారతదేశంలోని ప్రజలందరూ జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటని, ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులను దగ్గర చేసే సంతోషాల పండుగని పేర్కొన్నారు. దీపావళిని ఎన్నో రోజులపాటు కొనసాగే సంతోషాల ఈద్గా అభివర్ణించారు.
బీజేపీ విమర్శలు
ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ పండుగ సందర్భంలో కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సనాతన వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది సైతం కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించారు. ఇటీవల సోనియా గాంధీ బాబ్రీ మసీదు కూల్చివేతపై చేసిన వ్యాఖ్యలను కూడా ఈ వివాదానికి జోడించారు.





