కామారెడ్డి, 2026-07-29
కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మార్పీఎస్ కమిటీల బలోపేతం దిశగా జిల్లా ఇన్చార్జ్ మంతెన సామిల్ మాదిగ కీలక సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కమిటీలు చురుగ్గా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్ మంతెన సామిల్ మాదిగ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎమ్మార్పీస్ కమిటీలు నిర్వహించాలని కమిటీ ప్రతినిధులకు సూచించారు.
కమిటీ ప్రతినిధులుగా బట్ట వెంకట్ రాములు, కొత్తల యాదగిరి, సత్తి గారి లక్ష్మి, బానపురం లావణ్య, అంచనూర్ లక్ష్మణ్, మాజీ సర్పంచ్ అరుణ్, 6 మందిని నియమిస్తూ, మాదిగలను బలోపేతం చేయాలని, వారు తలెత్తుకుని తిరిగేలా పనిచేయాలని ఆదేశించారు.
అదేవిధంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంతిని సామెల్ మాదిగ, బట్ట వెంకట రాములు మాదిగ, కత్తి పద్మారావు మాదిగ, గంగారం మాదిగ, లక్ష్మీ మాదిగ, లావణ్య, రాజనర్సయ్య, శైలేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

