కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ భారతీయ రైల్వేలో టికెట్ల రద్దు, రీఫండ్ నియమాలు, బోర్డింగ్ పాయింట్ మార్పు వంటి అంశాలలో కీలక సంస్కరణలను ప్రకటించారు. ఈ మార్పులు ప్రయాణీకులకు మరింత సౌలభ్యాన్ని కల్పించనున్నాయి.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, మంత్రి అశ్విని వైష్ణవ్ రాబోయే 52 వారాలలో అమలు చేయనున్న 52 సంస్కరణల ప్రణాళికలో భాగంగా ఐదు ముఖ్యమైన సంస్కరణలను వెల్లడించారు. వీటిలో టికెట్ రద్దు, రీఫండ్ నియమావళిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే, కనీస ఫ్లాట్ రద్దు ఛార్జీ మాత్రమే వర్తిస్తుందని మంత్రి తెలిపారు. 72 గంటల నుండి 24 గంటల మధ్య రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 25 శాతం, 24 గంటల నుండి 8 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం రీఫండ్ లభిస్తుంది. 8 గంటల కంటే తక్కువ సమయంలో రద్దు చేసుకుంటే రీఫండ్ ఉండదని స్పష్టం చేశారు.











