కామారెడ్డి, 2026-08-21
జోన్- రాజన్న ఇన్చార్జ్ డఐజ స ఐపఎస్ యం రాజేష్ శుక్రవారం పోలసు కార్యాలయాన్ని సందర్శించి, శుక్రవారం పోలసు జరిగింది. సమక్షా అధికారులతో సమీక్షా తనిఖీలలో సందర్శన ఐపీఎస్ గారు నిజిల్లాత్రణ, నమోదుదర్యాప్తు, భద్రత, సైబర్ గారుపై కలక సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జోన్- రాజన్న ఇన్చార్జ్ డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈ సందర్శన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల పరిస్థితి, వివిధ నేరాల నమోదుదర్యాప్తు, కేసుల డిటెక్షన్, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు తదితర అంశాలపై డీఐజీ గారికి సమగ్ర వివరాలను అందించారు.
నేరాల నియంత్రణపై దృష్టి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం డీఐజీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని రకాల నేరాలు తగ్గగా, మరికొన్ని నేరాల్లో పెరుగుదల కనిపిస్తున్నందున సంబంధిత అధికారులు నేరాల పెరుగుదలకు గల కారణాలను విశ్లేషించి, ఫోకసింగ్ అప్రోచ్‌తో నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి నివాస ప్రాంతాలకు వెళ్లి పరిసర ప్రాంతాల ప్రజలతో మాట్లాడి వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

