భారతదేశ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 2.76 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది గత 20 నెలల్లోనే అత్యధిక నెలవారీ విక్రయాలు కావడం విశేషం. పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్‌తో దేశీయ మార్కెట్లో అమ్మకాలు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.
గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే మొత్తం వాహనాల విక్రయాలు 25 శాతం వృద్ధి చెందాయి. మొత్తం విక్రయాలు 2,76,120 వాహనాలుగా నమోదయ్యాయి. దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2,12,384 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 49,872 యూనిట్లకు చేరుకోగా, గత ఏడాదితో పోలిస్తే ఇది 59 శాతం పెరుగుదల.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యుటిలిటీ వాహనాలకు డిమాండ్
మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి యుటిలిటీ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఈ విభాగంలో గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 26.1 శాతం వృద్ధి నమోదైంది. యుటిలిటీ వాహనాల విక్రయాలు 97,787 యూనిట్లుగా ఉన్నాయి.
ప్యాసింజర్ కార్ల అమ్మకాలు
ఆల్టో, బాలెనో, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ వంటి ప్యాసింజర్ కార్ల విక్రయాలు కూడా 18.4 శాతం పెరిగి 1,00,877 యూనిట్లకు చేరుకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి

