సిద్దిపేట జిల్లా మక్కరాజ్పేట్ గ్రామంలో బెల్ట్ షాపుల నివారణకు మహిళలు ఉద్యమ బాట పట్టారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలు, సేవించడంపై కఠినమైన జరిమానాలు విధించాలని నిర్ణయించారు.
గ్రామంలో ఎక్కడైనా మద్యం విక్రయిస్తే రూ. 50,000 జరిమానా, మద్యం సేవిస్తే రూ. 10,000 జరిమానా విధించాలని మహిళలు ఏకగ్రీవంగా తీర్మానించారు. కుటుంబాలలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న మద్యం విక్రయాలను అరికట్టాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బెల్ట్ షాపుల ఆగడాలు పెరిగిపోవడంతో, మహిళా సంఘాలు ఏకమై ఈ వినూత్నమైన చర్యకు పూనుకున్నాయి. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, దీనిని అరికట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు.










