తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్న ఈగల్ ఫోర్స్ అధికారులు, మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో కోళ్ల ఫారం ముసుగులో నడుస్తున్న సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు కావడంతో, రసాయనాల సరఫరాదారులు, నిర్వాహకులపై విచారణ ముమ్మరమైంది.
తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దర్యాప్తు చేపట్టిన ఈగల్ ఫోర్స్ అధికారులు అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో కోళ్ల ఫారం ముసుగులో నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్న అక్రమ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ వ్యవహారంలో రసాయనాల సరఫరాదారులు, తయారీ కేంద్రాల నిర్వాహకులు, ఇతర వ్యక్తుల పాత్రపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆగస్టులో బయటపడిన కేసు
ఈ వ్యవహారం ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని బీబీనగర్ పోలీసులు కొండమడుగు నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో 27.2 కిలోల మెఫెడ్రోన్, 56.98 కిలోల అసిటోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తును ఈగల్ ఫోర్స్‌కు బదిలీ చేయడంతో డ్రగ్స్ తయారీ, సరఫరాకు సంబంధించిన విస్తృత నెట్‌వర్క్‌పై అధికారులు దృష్టి సారించారు.












