కామారెడ్డి, జూలై 31
యువతలో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు ‘మై భారత్’ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి (DYO) రమేష్, ఆర్.కే. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. రేపు (జూలై 31) ఆర్.కే. డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి.
యువతలో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిని ఉన్నతమైన కెరీర్ వైపు నడిపించేందుకు ‘మై భారత్’ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి (DYO) రమేష్, ఆర్.కే. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జైపాల్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో poster విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో అతిథులుగా కామారెడ్డి జిల్లా యూత్ ఆఫీసర్ రంగా వెంకటేశ్వర్ గౌడ్, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్ సర్, NSS POలు అంజయ్య, హరిత లు పాల్గొన్నారు.
Folk song, Folk dance, reel/ short film, drama, poetry, debate, slogan & painting విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. వేదిక: ఆర్.కే. డిగ్రీ కళాశాల సెమినార్ హాల్, కామారెడ్డి. తేదీ & సమయం: రేపు (జూలై 31) ఉదయం 10:00 గంటలకు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, యువశక్తిని దేశ నిర్మాణానికి ఎలా ఉపయోగించాలనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన ఆసక్తి, అర్హత గల విద్యార్థులందరూ రేపు ఉదయం 10 గంటలకల్లా ఆర్.కే. డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌కు చేరుకుని, తమ పేర్లను నమోదు (Report) చేసుకోవాలని కోరారు.











