నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమలు & ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పరిశ్రమల రంగంలో జిల్లా అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. మహబూబ్ బాషా, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అయ్యప్పరెడ్డి, పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అధికారుల నుంచి జిల్లాలో పరిశ్రమల పరిస్థితులపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై సూచనలు అందించారు.











