డోల్పా, 1 నవంబర్ 2026
నేపాల్‌లోని డోల్పా జిల్లాలో షే-ఫోక్సుండో సరస్సు వద్ద ట్రెక్కింగ్‌కు వెళ్లి ఆరుగురు భారతీయ పర్యాటకులు గల్లంతయ్యారు. భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా వారిని గుర్తించేందుకు, రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గల్లంతైన పర్యాటకులు డోల్పో బుద్ధ గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల ప్రాంతం నుంచి షే-ఫోక్సుండో సరస్సు వైపు ప్రయాణించారు. నుమ్లా పాస్, బగ్లా పాస్ ప్రాంతాల మధ్య వారు చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. వాతావరణ హెచ్చరికలను పట్టించుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. మంచు కారణంగా పర్వత మార్గాల్లో ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు ముందుగానే హెచ్చరించినప్పటికీ, పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు తెలిసింది.












