అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ చేసిన ఓ వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే అమెరికాలో రాష్ట్రంగా ఉన్న ఒహాయోను డెమోక్రాట్లు రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియో నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మీమ్స్, సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఒహాయోలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కలిసి ట్రంప్ జూనియర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెమోక్రాటిక్ పార్టీ విధానాలను విమర్శిస్తూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని, ఒహాయోను రాష్ట్రంగా మార్చాలని, వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించాలని వారు భావిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలోనే అసలు పొరపాటు దొర్లింది. ఎందుకంటే ఒహాయో 1803లోనే అమెరికాలో 17వ రాష్ట్రంగా చేరింది. ఈ విషయం తెలియకపోవడంతో ట్రంప్ జూనియర్ వ్యాఖ్యపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు రాజకీయ వ్యాఖ్యాతలు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఒహాయో ఇప్పటికే రాష్ట్రంగా ఉందని గుర్తుచేస్తూ వ్యంగ్య పోస్టులు పెట్టారు. మరికొందరు ఈ వ్యాఖ్యను ఎన్నికల ప్రచారంలో జరిగిన చిన్న మాటతప్పిదంగా అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం అమెరికా రాజకీయాల్లో చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఒహాయో విషయంలో ట్రంప్ జూనియర్ చేసిన వ్యాఖ్య మాత్రం ఈ ప్రచార సభలోని ప్రధాన చర్చగా మారింది.

