ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి, నటి అదితి రావు హైదరీ తొలిసారి జంటగా నటిస్తున్న హిందీ చిత్రం పారివారిక్ మనురంజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రేమ, హాస్యం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.
ప్రముఖ డిజిటల్ వేదిక సోనీ లివ్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే, సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తొలిసారి జంటగా పంకజ్ త్రిపాఠి, అదితి
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పంకజ్ త్రిపాఠి, అందంతో పాటు నటనతో గుర్తింపు తెచ్చుకున్న అదితి రావు హైదరీ ఈ సినిమాలో తొలిసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి కలయిక ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. టీజర్లో ఇద్దరి మధ్య సాగే సంభాషణలు, పరిచయం, క్రమంగా పెరిగే సాన్నిహిత్యాన్ని చూపించారు.












