దక్షిణ భారతదేశంలో కావేరీ నది తీరాన ఉన్న పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు పవిత్రమైనవి.
భగవంతుణ్ని భక్తులు ఏ రూపంలో కొలిస్తే, ఆయన ఆ రూపంలోనే దర్శనమిస్తాడు. ఈ సనాతన సంప్రదాయం దక్షిణ భారతదేశంలోని పంచరంగ క్షేత్రాలకు సంబంధించింది.
శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్ రాజధానిగా ప్రసిద్ధిచెందిన ఈ ప్రాంతానికి రంగనాథ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణ.
తిరుప్పునగర్, తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న ఈ క్షేత్రం విష్ణుమూర్తి అప్పకుడతాన్ పెరుమాళ్ గా దర్శనమిచ్చినది.
కుంబకోణం, లక్ష్మీదేవి కోమలవల్లిగా అవతరించిన ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి సారంగపాణి స్వామిగా పూజలందుకుంటాడు.
మయిలదుతురై, చంద్రుడి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి పరిమళ పెరుమాళ్ గా అవతరించిన స్థలం.
శ్రీరంగం, పంచరంగ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని విభీషణుడు ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతాయి.

