అధికారులు
ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలపై అధికారుల బృందం మంత్రికి వివరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌జే, నిమ్స్ ఆసుపత్రులలో క్యాన్సర్ రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారుల బృందం మంత్రికి వివరించింది.
జిల్లాల్లో ఏర్పాటు చేసిన కీమోథెరపీ సెంటర్ల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. ఇటీవల క్యాన్సర్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించి, క్యాన్సర్ రిజిస్ట్రీ, పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్, క్యాన్సర్ రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

