ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆదివారం ఢిల్లీలో నిరసన చేపట్టింది. జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ నాయకత్వం వహించారు. నిరసనకారులు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని ఎన్ఎస్యూఐ నేతలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి.












