దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ఆనందం, ఉల్లాసానికి ప్రతీక అని, సామరస్యం, సహోదరభావాన్ని పెంపొందిస్తుందని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.
హోలీ పండుగ సమాజంలో ప్రేమ, ఆశలను వ్యాప్తి చేయడంతో పాటు సామాజిక సమైక్యత స్ఫూర్తిని బలపరుస్తుందని ఆమె అన్నారు.
దేశంలోని విభిన్న సంస్కృతుల ఏకత్వానికి, ఐక్యతకు హోలీ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో తెలిపారు.
ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు.

