బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ తమ సరదా సంభాషణతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ నిర్వహించే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న ఈ జంట.. కుటుంబం, పిల్లల గురించి చమత్కారంగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా, సైఫ్‌ను కరీనా అడిగిన ప్రశ్న అందరినీ నవ్వించింది.
షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ.. సైఫ్ అలీఖాన్‌కు ప్రతి దశాబ్దంలో ఓ బిడ్డ పుట్టడం ఒక వరమని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి కరీనా స్పందిస్తూ తన భర్తను ఇలా అడిగారు: సైఫూ నీకు ప్రతి దశాబ్దంలో ఒక బిడ్డ పుడుతోంది మరి ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి కరీనా ప్రశ్నకు సైఫ్ సమాధానం చెప్పేలోపే షోలో మరో హాస్యభరితమైన సంభాషణ మొదలైంది. షో సహ-నిర్వాహకురాలు అర్చనా పూరన్ సింగ్ మాట్లాడుతూ, త్వరలో మరో దశాబ్దంలోకి అడుగుపెట్టబోతున్నామని అన్నారు. దానికి కరీనా వెంటనే స్పందిస్తూ.. అవును కానీ నాతో మాత్రం కాదు అని చమత్కరించారు. దీంతో సైఫ్ సిగ్గుతో నవ్వుకోగా, అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. సైఫ్ అలీఖాన్‌కు ఇద్దరు వివాహాల ద్వారా నలుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్య, నటి అమృతా సింగ్‌తో కలిగిన పిల్లలు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్. కరీనా కపూర్‌తో కలిగిన పిల్లలు తైమూర్ అలీఖాన్, జెహ్ అలీఖాన్. సైఫ్ తన ఇరవైలు ముప్పైలలో నలభైలలో యాభైలలో తండ్రయ్యారు. ఈ విషయాన్నే కపిల్ శర్మ తనదైన శైలిలో ప్రస్తావించడంతో షోలో నవ్వులు పూశాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గతంలో వోగ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కరీనా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. సైఫ్ తన జీవితంలోని ప్రతి దశాబ్దంలో తండ్రయ్యారని చెబుతూ అరవై ఏళ్ల వయసులో మాత్రం మరో బిడ్డకు తండ్రి కావడం జరగదని సరదాగా పేర్కొన్నారు. అలాగే, నలుగురు పిల్లలు వేర్వేరు వయసుల్లో ఉన్నప్పటికీ సైఫ్ వారందరికీ సమయం కేటాయిస్తారని ఆమె ప్రశంసించారు. పిల్లల బాధ్యతలు, సినిమా షూటింగులను సమన్వయం చేసుకోవడానికి తామిద్దరం ప్రయత్నిస్తుంటామని కూడా వెల్లడించారు. భార్యాభర్తల మధ్య సరదా సంభాషణగా సాగిన ఈ ఎపిసోడ్లో కరీనా వేసిన ప్రశ్నకు సైఫ్ ఇచ్చిన సిగ్గుతో కూడిన స్పందన అభిమానులను ఆకట్టుకుంటోంది.











