ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల్లో ప్రతికూల వ్యాఖ్యలు, పనితీరు నివేదికల ఆధారంగా బలవంతపు పదవీ విరమణ విధించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఉద్యోగి గత సేవా రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చతుర్ సింగ్ ధ్రువ్ కేసులో ఈ కీలక తీర్పు వెలువడింది. ప్రతికూల సర్వీస్ ఎంట్రీలు, ఉద్యోగి పనితీరుకు సంబంధించిన అంశాల ఆధారంగా తీసుకున్న బలవంతపు పదవీ విరమణ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక రహస్య నివేదికల్లో (ఏసీఆర్) నమోదైన ప్రతికూల వ్యాఖ్యలను ఉద్యోగికి ముందుగా తెలియజేయకపోయినా, బలవంతపు పదవీ విరమణ నిర్ణయం తీసుకునేటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి గత సర్వీస్ రికార్డుల్లోని ప్రతికూల అంశాలు, నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ గ్రేడింగ్‌లను కూడా పరిశీలించవచ్చని పేర్కొంది.











