అమెరికా యంత్రాంగం భారత్కు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి 30 రోజుల మినహాయింపు (waiver) ఇవ్వడాన్ని, భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందించింది. ఇది కేవలం నియంత్రణ కాదని, ఒక క్లిష్టమైన రాజకీయ వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, భారత్ సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు నౌకలను తీసుకోవచ్చని ప్రకటించారు. అయితే, ఈ 'అనుమతి' అనే పదాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది.
తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాము ఏ దేశం మీద ఆధారపడలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ జాతీయ ప్రయోజనాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకుండా మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటం అమెరికా ఉద్దేశ్యమని తెలుస్తోంది. అయితే, భారత్ తమ మాట వింటోందని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ 'మినహాయింపు' అనే పదాన్ని వాడుతున్నారని భారత్ ఆరోపిస్తోంది.
భారత ప్రభుత్వం పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో కూడా రష్యానే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉందని, కాబట్టి అమెరికా ఇచ్చే 'అనుమతి' ఒక కొత్త విషయం కాదని స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ, రష్యాతో వ్యాపారాన్ని భారత్ కొనసాగిస్తోంది.

