ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ టాటా స్టీల్ 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (2 27) మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ వాటాదారులకు ఆపాదించదగిన ఏకీకృత నికర లాభం రూ.3,666.41 కోట్లకు చేరింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 18.2 శాతం వృద్ధి.
కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఏకీకృత ఆదాయం గత ఏడాది ఇదే కాలంలోని రూ.58,689 కోట్ల నుంచి ఈసారి రూ.65,436 కోట్లకు పెరిగింది. అంటే ఆదాయంలో 11.5 శాతం వృద్ధి నమోదైంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం () రూ.10,665 కోట్లుగా నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దేశీయ వ్యాపారమే ప్రధాన బలం
కంపెనీ మొత్తం పనితీరులో భారత వ్యాపారం కీలక పాత్ర పోషించింది. దేశీయ విభాగం ఆదాయం రూ.42,653 కోట్లకు చేరగా, రూ.10,634 కోట్లుగా నమోదైంది. దేశీయ ఉక్కు ఉత్పత్తి గత త్రైమాసికంతో పోలిస్తే 7 శాతం పెరిగి 61.8 లక్షల టన్నులకు చేరింది. డెలివరీలు 16 శాతం వృద్ధితో 59.8 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.











