** (డాక్సిన్ టైమ్స్) జూలై 18
కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగింది.
కామారెడ్డి పట్టణంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును టౌన్ పోలీసులు శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఛేదించారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ సీఐ బి. నరహరి నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసును ఛేదించాయి. కేసు వివరాలను డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు.
పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం, తన భార్య శ్యామల మే 31న కనిపించడం లేదని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రోజు ఇద్దరూ కూలి పనుల కోసం కామారెడ్డికి రాగా, భర్తకు పని దొరకగా భార్యకు పని దొరకలేదు. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వస్తానని చెప్పిన శ్యామల తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు కొనసాగుతుండగా జూన్ 3న గ్రీన్ సిటీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్యామలగా గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో పాటు తలపై తీవ్ర గాయాలు ఉండటంతో కేసును హత్యగా నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.












