విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి పట్టణంలో శనివారం భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో జిల్లా అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో , విధి నిర్వహణలో దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి పట్టణంలో శనివారం భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో , జిల్లా అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, అశోక్‌నగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బందితో పాటు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కొవ్వొత్తులు చేతబట్టి అమరవీరులకు నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి, పోలీసు అమరవీరులకు పోలీస్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు.

