మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మండలం పెద్దమంగళారం గ్రామ సమీపంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేజీ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు, పంట పొలాల్లోని విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మృతులు మోక్ష సాయి చరణ్ (20), అత్తాపూర్ నివాసి; యశ్వంత్ (20), బాల్కంపేట నివాసిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కళాశాల వేడుకలు ముగిసిన అనంతరం కొంతమంది విద్యార్థులు పెద్దమంగళారం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి, విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో చరణ్, యశ్వంత్ సమీపంలోని వ్యవసాయ పొలంలోకి వెళ్లారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పంటను అడవి పందుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను వారు ప్రమాదవశాత్తు తాకడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన పొలం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

